మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం- గండూరి కృపాకర్

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): వినాయక చవితి పండుగను మట్టి వినాయక ప్రతిమలతో నిర్వహించుకుందామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్వంత ఖర్చులతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.