ఉచితంగా మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ
భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 18నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శ్రీ దత్తసాయి నర్సింగ్ హోం ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుండి మట్టి గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ రసాయనాలు,ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందన్నారు.అందుకే మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో గత 6 సం.లుగా ఇట్టి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.వినాయకచవితి పండుగను అందరూ మట్టి గణపతి విగ్రహాలతో జరుపుకోవాలని పర్యావరణ పరిరక్షణ అందరి బాద్యతని అన్నారు.ఈ సందర్భంగా ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.