కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులు
కొడంగల్ సెప్టెంబరు18(జనం సాక్షి):-కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పెట్ మండలం మేడిచెట్టుతండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.చేరిన వారిని ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొడంగల్ నియోజక వర్గంలోజరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైపార్టీలో చేరుతున్నారు అన్నారు. గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని పార్టీ కోసం కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే కోరారు.కార్యక్రమములో బిఆర్ఎస్ నాయకులు.కార్యకర్తలు పాల్గొన్నారు.