ట్రాక్టర్ కు డీజిల్ లేఖ, సైకిల పై చెత్త స్వీకరిస్తున్న

పంచాయతీ కార్మికులు బషీరాబాద్ సెప్టెంబర్ 19,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ట్రాక్టర్ కు డీజీలు లేక సైకిళ్లపై చెత్త స్వీకరిస్తున్న పంచాయతీ కార్మికులు ఈ విషయం పై బీజెవైయం మండల అధ్యక్షులు ప్రశాంత్ కౌరి ఖండించారు. గ్రామ పంచాయతీలో గత మూడు రోజులుగా ట్రాక్టర్ కు డీజిల్ సమకూర్చడం లేదని, సైకిళ్లపై చెత్త స్వీకరిస్తున్న పంచాయతీ కార్మికులకు కనీస వసతులు కల్పించడం లేదని ఎటు చూసినా కుప్పలు కుప్పలుగా మురికి చెత్తతో నిండిపోయిన వార్డులు,కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారని, వెంటనే అధికారులు స్పందించాలని తెలిపారు.