వార్డు సమస్యలను పరిష్కరించాలంటూ తిరగబడ్డ మహిళలుపరుగులు తీసినకమిషనర్

-భువనగరి టౌన్ (జనం సాక్షి):–హైదరాబాద్కు కూతపేట్టు దూర్రం లో ఉన్న భువనగిరి సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల అధిరూపాయల ప్రభుత్వ నిధులను మంజూరు చేస్తున్నది.
అదే పార్టీకి చెందిన అగ్ర నాయకులు నిబంధనలను తుంగలో తొక్కి అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ రాయగిరి నాలుగో వార్డ్ మహిళలు సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్భందించడంతో ఛాంబర్ లో కూర్చుని ఉన్న మున్సిపల్ కమిషనర్ దొడ్డి దారిన వెళ్లిపోయినారు.ఐదు గంటలపాటు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యమకారులు ఉండిపోవడంతో సిబ్బంది సైతం కార్యాలయం వెలుపల కూర్చోవాల్సి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లోనే వెంట తీసుకొచ్చిన వంట సామాగ్రితో వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఆగమేఘాలపై పోలీస్ సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారు కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న సీజనల్ వ్యాధుల గురించి అధికారులకు వివరించినా పట్టించుకోవడంలేదని వివరించారు.మున్సిపల్ అధికారులు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై నాలుగో వార్డ్ లో చేపట్టనున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు.మున్సిపల్ ప్లాన్ ప్రకారము ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ను ఆధునీకరించి నిర్మాణాలను చేపట్టక పోవడం తో యావత్ వార్డు మురికి మయం అయిందని ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో వార్డుకు చెందిన మాడిపల్లి రాజు, ఇరుకుల్ల రాజు, అర్చన, రాజు, ఏం నరసయ్య, కుటుంబాలకు చెందిన వ్యక్తులు డెంగ్యూ వ్యాధిగ్రస్తులై ఆసుపత్రులలో చికిత్స చేయించుకుంటున్నారని వివరించారు. ఈ విషయం మున్సిపల్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వివరించిన పట్టించుకోవడంతో చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అంటు వ్యాధులతో సతమతమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని వారు ఆరోపించారు.గతంలో రాయగిరి గ్రామపంచాయతీ భువనగిరి మున్సిపాలిటీలో విలీనం కావడంతో ప్రభుత్వం 2, 3,4 వార్డులుగా విభజించింది. రెండోవాడు మూడోవాడు కౌన్సిలర్ గా విజయం సాధించిన వారు భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. పొరుగు వార్డుల చైర్మన్, వైస్ చైర్మన్, లుగా తమ వార్డు ప్రజలు ఎన్నుకున్నారని వివరించారు. అయితే తమ పొరుగు పొరుగు వార్డుల ప్రజాప్రతినిధులు తమ వాడు అభివృద్ధికి గత నాలుగు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలను పరిష్కరించాలంటూ ఎన్నో మార్లు విన్నవించుకున్న ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. పెట్టకేలకు కోపో ద్రిక్తులైన మహిళలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మంగళవారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు,ఛాంబర్ లోని మున్సిపల్ కమిషనర్ తో తమ సమస్యలు విన్నవించు కుంటున్న సందర్భంగా ఇప్పుడే వస్తానంటూ కమిషనర్ వెళ్లిపోవడంతో చాంబర్లో బైఠాయించిన మహిళలు, నాయకులు అక్కడే వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టేందుకు పూనుకున్నారు. తమ పిల్లలు డెంగ్యూ మలేరియా వ్యాధులతో సతమతమవుతుంటే అధికారులు సాఫీగా కార్యాలయాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అంతేగాక భువనగిరిలో కోట్లాది రూపాయలతో చేపట్టి అభివృద్ధి పనులకు, ఏశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారో తెలియని పరిస్థితిలో ఉత్పనమవుతున్నాయని ఆరోపించారు. ప్రతి పనికి ఆ పని ఎస్టిమేట్, టెక్నికల్ అప్రూవల్, టెండర్ లో లెస్ టెండర్, వర్క్ అగ్రిమెంట్, వర్క్ ఆర్డర్ ఇంజనీర్ పర్యవేక్షణ లో సైట్ మెజర్మెంట్ చేసి అభివృద్ధి పనులను తీసుకున్న కాంట్రాక్టర్ కు అప్పజేయాల్సి ఉంటుంది, నాయకులు వివరించారు. ఈ నేపథ్యంలోనే రాయగిరి నాలుగో వార్డ్అభివృద్ధి కోసం ప్రభుత్వం 40 లక్షల రూపాయలను గత నాలుగు నెలల క్రితం మంజూరు చేసిన సంబంధిత అధికారులు టెండర్ పిలవకుండా మున్సిపల్ ఇంజనీయర్ మార్కౌట్ ఇవ్వకుండా కాలయాపన చేయడం యావత్ వార్డు మురికి కూపంగా మారిపోయిందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోతే నిరవధిక సమ్మెను మున్సిపల్ కార్యాలయం ముందు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగల్ల పల్లి రవికుమార్, వైఎస్ ఆర్ సీ పీ నాయకులు అతహర్, కూర వెంకటేష్, పూర్ణచందర్, ఆవు శెట్టి పాండు,మహిళా నాయకులు అర్చన, లక్ష్మి, వనజ, నర్సమ్మ, పావని, మాధవి, లలిత, కవిత, హేమలత తదితరులు పాల్గొన్నారు.