మట్టికథ సినిమా బృందాన్ని అభినందించిన ఎమ్మెల్యే.
తాండూరు సెప్టెంబర్ 20( జనం సాక్షి)మట్టికథ సినిమా బృందాన్ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అభినందించారు. తాండూరు పట్టణానికి చెందిన పవన్ కడియాల కథ మరియు దర్శకత్వంలో నిర్మించిన మట్టి కథ చిత్రం ఇండో ఫ్రెంచ్ ఫిలిం ఫెస్టివల్ తో పాటు పలు అంతర్జాతీయ వేదికల్లో ఉత్తమ చిత్రంగా నిలవడం పట్ల ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బుధవారంతాండూరులోని ఆయన నివాసంలో చిత్ర బృందాన్ని అభినందించారు. స్థానికుడు పవన్ కడియాల సినిమా రంగంలో రాణించడం అభినందనీయమని యువత ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలోబిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి,రమేష్ చంటి చిత్ర బంధం సభ్యులు తదితరులు ఉన్నారు.