పల్లె పల్లె కు పైలెట్ ఆత్మీయ పలకరింపు,కలసికట్టుగా పనిచేద్దాం

బషీరాబాద్ సెప్టెంబర్ 19, (జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలోని మంగళ వారం రోజున ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకొని పల్లె పల్లెకు పైలెట్ ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.నీళ్ళ పల్లి, ఇస్మాయిల్ పూర్,జలాల్ పూర్, మైల్వార్,కంసాన్ పల్లి,ఎక్మైయి,మంతన్ గౌడ్ మంతన్ గౌడ్ తండా,బషీరాబాద్,జీవంన్గీ, క్యాధ్గీరా,గంగారం,మాసన్ పల్లి, గొట్టిగా,కుప్పన్ కోట్,మంతట్టి, పలు గ్రామాలలో ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ నేను మీ బిడ్డను ఇంటోడు ఇంటోడే బైటోడు బయటోడే,నేనెప్పుడూ జనంలోనే ఉంటా,నాపై మీ అందరి ఆశీర్వాదం కావాలి ఈ సారి భారీ మెజారిటీతో గెలిపించాలి.ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్ గల్లంత కావాలి,ప్రతిపక్షాలు సముద్రంలో కలుస్తాయి.బీఅర్ఎస్ ప్రభుత్వ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ బిఆర్ఎస్ ప్రభుత్వమని,ఈ పథకాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని,పలు అభివృధి పనులు,ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్) బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తం రావు,శ్రీశైల్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి,మునిందర్ రెడ్డి,నర్సిరెడ్డి, బన్సీలాల్,సికిందర్,ధన్ సింగ్, మహారాష్ట్ర అంబన్న,గోపాల్ మంతట్టి కృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.