తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు.
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో,జనంసాక్షి:స్వంత పార్టీ వారు అయిన, ఇతర పార్టీ వారు అయిన, ఇతరులు ఎవరైనా తప్పు చేస్తే సహించేది లేదుని బిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ పట్టణ అధ్యక్షుడు బాదం రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల బిఆర్ఎస్ పార్టీలో చేరిన కార్తీక్ అనే యువకుడు మంగళవారం సాయంత్రం నాగర్ కర్నూల్ పట్టణంలో జరిగిన సంఘటనపై బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాదం రమేష్ స్పందించారు, జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, తీవ్రంగా ఖండించారు.అతను వ్యవహరించిన తీరు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని అతను పార్టీలో వుంది చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు అతన్ని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.ఆలాంటి సంఘటనలకు ఎవరైనా పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని,జరిగిన ఘటనపై విచారణ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.