అలుపెరుగని పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ..
మల్లాపూర్ సెప్టెంబర్ 21(జనం సాక్షినిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మల్లాపూర్ మండల కేంద్రంలోనీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం దగ్గర మల్లాపూర్ పద్మశాలి భక్త మార్కండేయ సంఘం అధ్యక్షులు సిరిపురం రవీందర్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లాపూర్ మండల పద్మశాలి అధ్యక్షులు దశరథం, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలి అధ్యక్షులు సిరిపురం రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిది. 1969లో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టిన త్యాగశీలి.ఇక, 2000 సంవత్సరంలో మలి దశ ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్‌ను ప్రోత్సహించడమే కాకుండ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న తన నివాస బంగ్లా జలదృశ్యంను టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారు. 97 ఏళ్ల వయసులో 2012 సెప్టెంబరు 21న ఆయన కన్నుమూశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబార్ శంకర్, మండల ప్రధాన కార్యదర్శి పెంబీ మహేందర్, ప్రచార కార్యదర్శి మోర సతీష్, ఎంపిటిసి ఆకుతోట రాజేష్, ఖ్యాతం జీవన్ రెడ్డి, సెంట్రింగ్ లక్ష్మణ్, పెద్దిరెడ్డి లక్ష్మణ్, పలువురు పద్మశాలి కుల సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.