సిద్దిపల్లెలో కొండ లక్ష్మణ్ బాపూజీకి నివాళులు
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సిద్ది పల్లె గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కమాన్పూర్ తాసిల్దార్ వంగా మోహన్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ , సిద్దిపల్లె సర్పంచ్ తాటికొండ శంకర్ పాల్గొని మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ పోరాట యోధుడు వారి జ్ఞాపకాలను ఈ యాది చేస్తూ వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెరుగు వెంకటేశ్వర్లు ఆర్ఐ సమ్దాని, రామ్మూర్తి, రాజ్ కుమార్ శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.