24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
కాంగ్రెస్ కూటమిని నమ్ముకుంటే చీకట్లు తప్పవు
ఎల్లారెడ్డి ప్రచారంలో హరీష్ రావు హెచ్చరిక
కామారెడ్డి,డిసెంబర్1(జనంసాక్షి):దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇది కొనసాగాలంటే కెసిఆర్ నాయకత్వమే శరణ్యమని అన్నారు. కొట్లాడి తెచ్చకున్న తెలంగాణను ఆంధ్రాపెత్తందార్లకు అప్పగించొద్దన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డికి మద్దతుగా గాంధారిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఏడాదిలోగా గాంధారికి కాళేశ్వరం నీళ్లు తెస్తామని హావిూనిచ్చారు. కేసీఆర్ ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తారని స్పష్టం చేశారు. ఆసరా పెన్షన్లు పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 40 లక్షల మందికిపైగా పెన్షన్లు అందుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెసోళ్లు గెలిస్తే కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు బంద్ అవుతాయన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆగిపోతాయని హరీష్‌రావు అన్నారు. పెన్షన్లు రావాలంటే మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని తెలిపారు. కేసీఆర్ ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తారన్నారు. దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పుకొచ్చారు. వృద్దాప్య పెన్షన్లను రూ.2వేలకు పెంచుతున్నామని హావిూ ఇచ్చారు. గాంధారి మండలాన్ని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించిన హరీష్‌రావు పోడు భూములకు పట్టాలిస్తామని, రైతుబంధు అమలు చేస్తామని హావిూ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. డ్వాక్రా, ఐకేపీ బృందాలు మరింత బలోపేతం కావాలన్నారు. ప్రతి విషయంలో పేదల గురించి ఆలోచించే నాయకుడు సీఎం కేసీఆర్ అని హరీష్ రావు పేర్కొన్నారు. మోదీ, సోనియా, రాహుల్, అమిత్‌షాలు రాజకీయ పర్యాటకులు. కేసీఆర్ ఒక్కరే పక్కా లోకల్. కూటమికి అధికారమిస్తే తెలంగాణలో మళ్లీ చీకటిరోజులు వస్తాయి. రైతుల ప్రయోజనాల కోసం చేపట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రద్దుచేస్తారు. కాంగ్రెసోళ్లు దేశముదుర్లు, పలు కండువాలు కప్పుకొని వచ్చి సొళ్లుమాటలు చెప్తారు. విని మోసపోయి ఆగమైతే భవిష్యత్ నాశనమవుతుందిఅని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో కరంట్ లేదంటున్న మోదీ, తీగలను పట్టుకొని చూస్తే తెలుస్తదన్నారు. ప్రాజె క్టులను అడ్డుకొనే చంద్రబాబుతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకొన్నదని నిలదీశారు. టీఆర్‌ఎస్ నాలుగేండ్ల పాలనను చూసి మళ్లీ గెలి పించాలని కోరారు. కూటమికి అధికారమిస్తే తెలంగాణలో మళ్లీ చీకటిరోజులు వస్తాయి. రైతుల ప్రయోజనాల కోసం చేపట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రద్దుచేస్తారు. మోసపోయి ఆగమైతే భవిష్యత్ నాశనమవుతుందని హెచ్చరించారు.