25వేల మాఫిపై హెచ్‌ఎంఎస్‌ ధర్నా

కాకతీయఖని, జూన్‌ 18 (జనంసాక్షి) : సకల జనులసమ్మె కాలంలో కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన రూ 25వేల అడ్వాన్స్‌ను మాఫి చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  ఈ సందర్బంగా హెచ్‌ఎంఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు గౌరీపతిశర్మ మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ సంఘాలు ఏరియర్స్‌పై కపట నాటకం ఆడుతున్నట్లు ఆరోపించారు. ఇంతకాలం గుర్తుకురాని సమస్యను ఎన్నికల ముందు తెరమీదికి తీసుకురావడం వారి స్వార్థప్రయోజనాలకు అద్దంపడుతున్నట్లు పేర్కొనారు. కోల్‌ఇండియాలో జరిగిన సమావేశంలో ఏరియర్స్‌పై చర్చించిన నాయకులు 25వేల మాఫి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చర్చలు జరుగుతుండగానే సమ్మెను విరమించి యాజమాన్యం వద్ద లొంగుబాటు దోరణిని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ అవలంబించడంతోనే అడ్వాన్స్‌ పై యాజమాన్యం స్పందించడం లేదన్నారు. నాడే యాజమాన్యం వద్ద గట్టిగా ప్రశ్నిస్తే అడ్వాన్స్‌కు బదులుగా బోనస్‌ వచ్చేదని పేర్కొన్నారు. సమ్మె కాలంలో ఏఐటీయూసీి, ఐఎన్‌టీయూసీ నాయకులు గనుల వద్దకు కనీసం రాకుండా సమ్మె విరమణ జరగక ముందే యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందం చేసుకొని కార్మికులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. అడ్వాన్స్‌ను మాఫి చేయించాల్సిన బాధ్యత ఆ సంఘాల నాయకులదేనని స్పష్టం చేశారు. టీబీజీఎస్‌ సైతం ఈ విషయంలో డ్రామాలాడుతున్నట్లు విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయ జేెఏసీి నాయకులు ఈ విషయంలో స్పందించి కార్మికులకు తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌చేశారు. ఈ సమావేశంలో నాయకులు సుజేందర్‌, స్వామి, దేశియా, మల్లయ్య,  సుదర్శన్‌, శ్రీనివాస్‌, విజయ్‌, యుగంధర్‌, భిక్షపతి, ారి తదితరులు పాల్గొన్నారు.