26 నుంచి కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్‌ మూడోదశ తనిఖీలు

హైదరాబాద్‌ : ఈనెల 26 నుంచి డిసెంబర్‌ 1 వరకు 200 కళాశాలల్లో మూడో దశ తనిఖీలు చేపట్టనున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ కన్వీనర్‌ అజయ్‌ జైన్‌ తెలిపారు.టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. డిసెంబర్‌ 10 నుంచి 15 వరకు 180 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నాలుగోదశ తనిఖీలు, డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు 139 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చివర దశ తనిఖీలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జనవరి ఒకటి నుంచి ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కళాశాలల్లో తనిఖీలు చేపడతారు. ఇప్పటికే తనిఖీలు పూర్తయిన కళాశాలల్లో అవసరమైతే తనిఖీలు చేపట్టనున్నట్లు కన్వీనర్‌ అజయ్‌జైన్‌ చెప్పారు.