27న సింహగర్జన
ఆదిలాబాద్,మే19(27న సింహగర్జన): వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించే దళిత, గిరిజన సింహ గర్జన సభకు దళితులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోల్‌బెల్ట్ నస్పూర్ దళిత సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. ప్రభుత్వం దళితుల హక్కులు హరించే కుట్రలో భాగంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడానికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సుప్రీం కోర్డు అట్రాసిటీ కేసులో అరెస్టులు చేయరాదని తీర్పు ఇవ్వడం అంటే దళితుల హక్కులు హరించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ఆర్డినెన్స్ తెచ్చి అట్రాసిటీ కేసును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈనెల 27న దళిత, గిరిజన సింహ గర్జన సభ విజయవంతం కోసం తరలి రావాలన్నారు. మంద కృష్ణమాదిగ హాజరవుతున్నారని పేర్కొన్నారు.
—–