28న ‘ముఖ్యమైన రోజులు – తేదీలు’ పుస్తకావిష్కరణ

కరీంనగర్‌, మే 26 : రచయిత్రి కందుకూరి కృష్ణవేణి రచించిన ముఖ్యమైన రోజులు, తేదీలు పుస్తక ఆవిష్కరణ ఈనెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక ఫిలిం భవన్‌లో జరుగుతుందని సమైక్య సాహితి అధ్యక్షుడు మాడిశెట్టి గోపాల్‌, ప్రధాన కార్యదర్శి కెఎస్‌ అనంతాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాతవాహన విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్‌ కె.వీరారెడ్డి హాజరై పుస్తకావిష్కరణ చేస్తారని, రాజీవ్‌ విద్యా మిషన్‌ ప్రాజెక్ట్‌ అధికారి వి.గంగారెడ్డి, హాస్య పుస్తక రచయిత ఎంవీ నర్సింహారెడ్డి విశిష్ట అతిథులుగా హాజరవుతారని తెలిపారు. గౌరవ అతిథులుగా తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, బహుభాషావేత్త డాక్టర్‌ నలిమెల భాస్కర్‌, గర్రెపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం.రాజయ్య, ఆత్మీయ అతిథులుగా ప్రముఖ కథా రచయిత కేవీ నరేందర్‌, ప్రముఖ విమర్శకుడు దాస్యం సేనాధిపతి పాల్గొంటారని వారు తెలిపారు. జాతీయ సాహిత్య పరిషత్‌ కరీంనగర్‌ ప్రధాన కార్యదర్శి గాజుల రవీందర్‌ పుస్తక సమీక్ష చేస్తారని వారు పేర్కొన్నారు. సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని గోపాల్‌, అనంతాచార్యలు కోరారు.