28 ఏళ్ల నిరీక్షణకు తెర టెస్ట్ సిరీస్ ఇంగ్లండ్‌వశం..
ట్రాట్, బెల్ సెంచరీలు డ్రాగా ముగిసిన చివరి టెస్ట్
టెస్ట్‌ల్లో రెండో ర్యాంక్‌లోనే ఇంగ్లండ్ ఐదుకు దిగజారిన భారత్ ర్యాంక్
నాగ్‌పూర్, డిసెంబర్ 17: అద్భుతాలేవిూ జరగ లేదు. ఇంగ్లాండ్ జట్టు రిస్క్ తీసుకోలేదు.. ఊహిం చినట్టుగానే నాగ్‌పూర్ టెస్ట్ డ్రాగా ముగిసింది. స్లో వికెట్‌పై భారత బౌలర్ల వైఫల్యం కొనసాగిన వేళ చివరిరోజు కేవలం ఒకే ఒక వికెట్‌తో సరిపెట్టుకో వడంతో ఇంగ్లాండ్‌దే పై చేయిగా నిలిచింది. ఇయ న్ బెల్, జొనాథన్ ట్రాట్ సెంచరీలు మాత్రమే చివరి రోజు ఆటలోని విశేషాలు. మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇంగ్లాండ్ జట్టు 28 ఏళ్ళ తర్వాత భారత గడ్డపై సిరీస్ విజయాన్ని కైవసం చేసు కుంది. నాగ్‌పూర్ టెస్టులో చివరి రోజు కూడా ఇంగ్లాండ్ జోరు కొనసాగింది. స్లో వికెట్‌పై భారత బౌలర్లు చేతులెత్తేసిన వేళ ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడింది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకనుకున్న ఇంగ్లీష్ టీమ్ మూడు సెషన్లూ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ట్రాట్, బెల్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. లంచ్‌కు ముందు ట్రాట్ శతకం సాధిస్తే… టీ బ్రేక్ తర్వాత బెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ట్రాట్ సెంచరీ అవగానే, బెల్ శతకం కోసం ఇంగ్లాండ్ ఎదురుచూడడంతొ టీ బ్రేక్ తర్వాత భారత్ బ్యాటింగ్‌కు దిగుతుందని అంతా భావించారు. అయితే అలెస్టర్ కుక్ మాత్రం ఇన్నింగ్స్ కొనసాగించేందుకే మొగ్గు చూపాడు. దీంతో భారత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు అవకాశమే రాలేదు. చివరికి మరో గంటలో ఆట ముగుస్తందనగా ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 352 పరు గుల దగ్గర డిక్లేర్ చేసింది. ట్రాట్ 143 , బెల్ 116 పరుగులు చేశారు. అయితే ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించడంతో మ్యాచ్ ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు. రోజంతా శ్రమించి భారత బౌలర్లు కేవలం ఒకే ఒక వికెట్‌తో సరిపెట్టుకున్నా రు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా ముంబై, కోల్ కత్తా టెస్ట్ విజయాలతో సిరీస్ ఇంగ్లాండ్ కైవ సం చేసుకుంది. అహ్మాదాబాద్‌లో జరిగిన మొదటి టెస్టులో మాత్రమే టీమిండియా విజయం సాధిం చింది. మరోవైపు 28 ఏళ్ళ తమ నిరీక్షణకు తెరప డడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ళ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇటీవలే టెస్టుల్లో అగ్రస్థానం కోల్పోయిన ఆ జట్టు మళ్ళీ దానిని అందుకునే దిశ గా తొలి అడుగు వేసింది. స్పిన్ పిచ్‌తో వారిని ఇబ్బందిపెడదామనుకున్న భారత కెప్టెన్ ధోనీ చివరికి ఆ ఉచ్చులో తానే చిక్కుకుని సిరీస్ కోల్ప యాడు. ఇదిలా ఉంటే మ్యాచ్‌లో రాణించిన ఇంగ్లాండ్ బౌలర్ ఆండర్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. అలాగే సిరీస్ ఆద్యంతం పరుగుల వర పారించిన ఆ జట్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఈ సిరీస్‌లో కుక్ వరుస సెంచరీలతో 568 పరు గులు చేశాడు. టెస్ట్ సిరీస్ ముగియడంతో రెండు జట్లు ఇక షార్ట్ ఫార్మేట్‌పై దృష్టి పెట్టనున్నాయి. రెండు టీ ట్వంటీల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ గురువారం పుణెలో జరగనుంది.
స్కోర్లు ః ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 330 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 329/9 డిక్లేర్డ్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 352/4 డిక్లేర్డ్