29లోపే తెలంగాణ: శంకర్రావు

హైదరాబాద్‌: కేంద్రం ఈ నెల 29లోపే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తుందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. తనకు ఢిల్లీ నుంచి ఖచ్చితమైన సమాచారం ఉందని ఆయన తెలియజేశారు. కవాతు నిర్వహించాల్సిన అవసరం రాదని అన్నారు. తెలంగాణ ప్రకటన రాకున్నా మార్చ్‌ను ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మార్చ్‌ను ప్రశాంతంగా నిర్వహిస్తేనే తాను  మార్చ్‌లో పాల్గొంటానని అన్నారు. ఎలాంటి హింసాయుత సంఘటనలు జరుగకుండా  తెలంగాణ మార్చ్‌ నిర్వహిద్దామని ఆయన తెలిపారు.