29న జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభం

శ్రీకాకుళం, జూలై 22: జిల్లా పోలీసు కార్యాలయ నూతన భవనాన్ని ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ భవనంలోనికి ఎస్పీ, ఎఎస్పీ కార్యాలయాలు, జిల్లా క్రైమ్‌రికార్డ్స్‌ బ్యూరో, ఫింగర్‌ ఫ్రింట్స్‌, వైర్‌లెస్‌, ఇ-కాప్స్‌(కంప్యూటర్‌ సెక్షన్‌), క్లూస్‌టీం విభాగాలను తరలించనున్నారు.