29న దళితబంధు యూనిట్లు పంపిణీ
* ఎంపీడీవో తాళ్లూరి రవి
,జూలూరుపాడు జులై 26, జనంసాక్షి: దళిత కుటుంబాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం యూనిట్లను లబ్దిదారులకు ఎమ్మెల్యే రాములు నాయక్ చేతులమీదుగా ఈ నెల 29న పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో తాళ్లూరి రవి తెలిపారు. మంగళవారం ఎంపిడిఓ కార్యాలయంలో దళిత బంధు లబ్ధిదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి లావుడియా సోనీ, మండల ప్రత్యేక అధికారి బీమ్లా నాయక్ మాట్లాడుతూ మండలంలో 17 మంది దళితులను దళిత బంధు పథకానికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎంపిక చేసిన యూనిట్ల ప్రకారం గ్రౌండింగ్ చేసిన దుకాణాలు, ట్రాక్టర్లు, కార్లు, ట్రాలీ వాహనాలను ఎమ్మెల్యే రాములు నాయక్ పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.