సమస్యల పరిష్కారానికి అందోళన కార్యక్రమాలు
కాగజ్‌నగర్ : విద్యత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 31 నుంచి దశలవారీగా అందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రఅధ్యక్షుడు సీతారామరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక వినయ్ గార్డెన్‌లో జిల్లా స్థాయి విద్యుత్తు ఉద్యోగుల సమావేశంలో పాల్గోని అయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పద్మారెడ్డి జనార్థన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.