3నుంచి ట్రిపుల్‌ ఐటి క్లాసులు

ముగిసిన కౌన్సిలింగ్‌ ప్రక్రియ

నిర్మల్‌,జూన్‌23(జ‌నం సాక్షి): బాసర ట్రిపుల్‌ ఐటీలో వచ్చే నెల 3వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ట్రిపుల్‌ ఐటిలో కౌన్సిలింగ్‌ ద్వారా ఎంపిఐన వారి పేర్లను వెబ్‌సైట్లో ఉంచుతారు. విద్యార్థుల కౌన్సెలింగ్‌ పక్రియ శుక్రవారం ముగిసింది. ఇందులో 1233 మంది విద్యార్థులు ప్రవేశం కల్పించారు. మరో 171 మంది కౌ న్సెలింగ్‌కు గైర్హాజరయ్యారు. వీరి స్థానాల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ నుంచి ఎంపిక చే యనున్నట్లు యూనివర్సిటి ఏవో వెంకటస్వామి తెలిపారు. ఈ జాబితాను త్వరలో యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. 96 సీట్లను వివిధ స్పోర్ట్స్‌, క్యాప్‌, దివ్యాంగుల కోట కింద ఎంపికైన వారికి ప్రత్యక్షంగా ద్రువీకరణ పత్రాలను పరిశీలించి ఈ నెల 28 వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నూతన విద్యార్థులకు వచ్చే నెల 3వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.

 

తాజావార్తలు