3 వ రోజు కు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన బిజెపి నాయకులు

గద్వాల నడిగడ్డ, జులై 27 (జనం సాక్షి);
రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల నిరవధిక సమ్మె బుధవారం 3 వ రోజుకు బిజెపి నాయకులు సంఘీభావం తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో తహసిల్దార్ ఆఫీస్ ముందు వీఆర్ఏల నిర్వాదిక సమ్మెకు బిజెపి మండల అధ్యక్షులు నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ వారినీ ఉద్దేశించి మాట్లాడుతూ వీఆర్ఏలు గత కొన్ని రోజులుగా పే స్కేల్ సాధన కొరకు రిలే నిరాహార దీక్షలు గత 23వ తారీకు కలెక్టరేట్ ముట్టడిలో చేయడం అప్పటికి ప్రభుత్వం స్పందించని కారణంగా 25వ తారీకు నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లడం జరిగిందని, నిరవధిక సమ్మె రెండు రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడో రోజు కొనసాగిస్తున్న వి ఆర్ ఏ డిమాండ్లు కొత్తగా కోరుకునేది ఏం లేదని సీఎం 2020 సెప్టెంబర్ 9వ తారీకు నిండు అసెంబ్లీ సాక్షిగా విఆర్ఏలకు పే స్కేలు ఇస్తామని,55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగిందనీ, సీఎం హామీ ఇచ్చినా దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడు అన్నట్లుగా సీసీఎల్ఏ ప్రధాన అధికారి నిర్లక్ష్య వైఖరి చేస్తున్నాడం జరుగుతుందనీ, వీఆర్ఏల పేస్కేల్ జీవో వచ్చేంతవరకు ఈ సమ్మె కార్యక్రమాన్ని ఇంకా జీవో విడుదల అయ్యేంతవరకు సమ్మె విరమించబోమని తదుపరి కార్యక్రమం ప్రజల అందరి మద్దతుతో ఇంకా ఉధృతం చేస్తామని వీఆర్ఏలు అన్నారు.
ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి బి జె పి మండలాధ్యక్షుడు నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ తో పాటు బిజెపి ఓబిసి మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు జగన్ గౌడ్,ఓ బి సి మోర్చ మండల అధ్యక్షులు హాయ్ రాజు, మండల కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, బోయ వెంకటేష్ బిజెపి కార్యకర్తలు వీఆర్ఏలకు మద్దతు ఇవ్వడం జరిగింది.
వడ్డేపల్లి మండల వీఆర్ఏ అధ్యక్షులు బి.ఈశ్వరన్న, జోగులాంబ జేఏసీ కో కన్వీనర్ మమత, జోగులాంబ జేఏసీ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్, మండల అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, బి.మద్దిలేటి, బీచుపల్లి, పాండు, బడే సాబ్, నాగమణి, విజయుడు, కృష్ణ, ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.