‘3వ కూటమి పార్కింగ్‌లాట్ వంటిది’
తిరుపతి : మూడవ కూటమి పార్కింగ్ లాట్ లాంటిదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తిరుపతిలో మోడీ ఫర్ పీఎం సభలో ఆయన మాట్లాడుతూ… తృతీయ కూటమికి ఓటు వేస్తే అది అవినీతి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి ప్రయత్నిస్తాయి. యూపీఏ పాలనలో ధరలు ఆకాశంలోకి వెళ్లగా ప్రజలు పాతాళంలో కూరుకుపోయారని కాంగ్రెస్‌ను ఎండగట్టారు. రానున్న ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించేవని, ఈ ఎన్నికల్లో మోడీని దేశానికి ప్రధానిని చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆయన ఉద్ఘాటించారు