30నుంచి కోస్తా రైతు హక్కుల ఉద్యమం

గుంటూరు: ఈనెల 30నుంచి గుంటూరు కృష్ణా, ప్రకాశం జిల్లాలో రైతు హక్కుల కోసం ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివప్రసాద్‌ తెలిపారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం చేతగాని తనం వల్ల మాగాణి భూముల్లో విత్తనాలు వేసేందుకు రైతులు ఆయోమయ స్థితిలో ఉన్నారన్నారు. సాగర్‌, డెల్టా ధాన్యాగార రైతులు తీవ్ర సంక్షభంలో ఉన్నారు. కోస్తా రైతుల జల వినియోగ హక్కు సర్వనాశనమైంది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి గోడదెబ్బ చెంపదెబ్బలా తయారైంది. ప్రభుత్వ చేతగాని తనం వల్లే విద్యుత్తు సంక్షభం ఏర్పడిందని ఆరోపించారు.