32,14,082 లక్షల విలువ గల ధాన్యం నిల్వల సీజ్‌

హుజూరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : జిల్లాలో సంచలనం సృష్టించిన రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలను హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లి గ్రామ శివారులోని శోభ స్టీమ్‌ ఇండస్ట్రీస్‌ ఫారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లు  రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. గత మూడు రోజు లుగా శోభ రైస్‌ మిల్లులో తనిఖీలు నిర్వహించి, మిల్లులో ఉన్న బియ్యం పౌరసరఫరాల శాఖకు సంబంధించినవని నిర్ధారించి, 1463.34 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్‌ చేసినట్లు దీని విలువ 23,41,344రూ||లు ఉంటుందని తహశీల్దార్‌ రవి తెలిపారు. అదేవిధంగా శోభ రైస్‌ మిల్లులో ఉన్న వరి ధాన్యం 786క్వింటాళ్లు రికార్డులలో వ్యత్యాసం రావడంతో దాన్ని కూడా సీజ్‌ చేసి నట్లు తహశీల్దార్‌ పేర్కొన్నారు. వరి ధాన్యం విలువ 8,72,738 ఉంటుందన్నారు. ఈ తనిఖీలో డీటీసీఎస్‌ రమేష్‌ తనిఖీ టీం ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారన్నారు. అధికారులు రాజేశ్వర్‌, సురేష్‌, రాజామనోహర్‌రెడ్డి, రాజేశం, మధుసూదన్‌రెడ్డి, ఎఫ్‌ఐలు భూపేష్‌, శ్రీనివాసరావు, రమేష్‌, రాజా నరేందర్‌, ఆర్‌ఐ దినేష్‌రెడ్డి, వీఆర్‌వో రాంచందర్‌రావులు పాల్గొన్నారని తెలిపారు.