34 ఎర్రచందనం దుంగలు పట్టివేత
గిద్దలూరు , జూలై 15 :
మండలంలోని ఉయ్యాలవాడ సమీపంలో సుమోలో అక్రమంగా తరలిస్తున్న 34 ఎర్రచందనం దుంగల ను గిద్దలూరు ఫారెస్ట్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎర్రచందనం దుంగల తో పాటు సుమోను గిద్దలూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగ లు లక్షా 50 వేలు ఉంటుందని వారు తెలిపారు. ఈ దాడిలో ఎఫ్‌ఎస్‌ఓ వెంకటసుబ్బయ్య, నాగయ్య, ఎఫ్‌బిఓలు కృష్ణాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.