*35 క్వింటాళ్ల పీడిఎస్ బియ్యం పట్టివేత*
మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 14
(జనం సాక్షి)
జగిత్యాల జిల్లా పౌర సరఫరాల అధికారి ఆదేశానుసారం వచ్చిన రహస్య సమాచారం మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం లోని అర్బన్ కాలనీ వెనుక వైపు ఉన్న రామేశ్వర కోళ్ల ఫారం లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 35 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం ను పట్టుకోవడం జరిగింది ఇట్టి దాడిలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, సివిల్ సప్లై డిటి ఉమాపతి,సివిల్ సప్లై ఇనస్పెక్టర్ శ్రీనివాస్ యాదవ్, మరియు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు