3,525 మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా
ఖమ్మం, జూలై 20: మూడు రోజులుగా జిల్లాలో 3,525 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. ఇఫ్కో యూరియా, కాంప్లెక్స్ ఎరువు కూడా వచ్చాయని, వాటిని మార్క్‌ఫెడ్‌కు, ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్టు ఆయన తెలిపారు. అన్ని రకాల ఎరువులు అందుబాటులో వున్నాయని, ఎటువంటి కొరత లేదన్నారు. ఎమ్మార్పీకే ఎరువులు కొనుగోలు చేయాలని ఆయన రైతులను కోరారు.