36వ రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ చేపట్టిన పల్లెబాట 36వ రోజుకు చేరింది. పది జిల్లాల్లో పల్లెబాట జోరుగా కొనసాగుతొంది. వీధులన్ని జై తెలంగాణ నినాదాలతో మార్మోగుతున్నాయి. పల్లెల్లో గులాబీ జెండాలు రెపరెపలాడతున్నాయి. సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 28లోపు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ప్రకటించకపోతే కాంగ్రెస్‌ కష్టకాలం తప్పదంటున్నారు. ప్రజల సమస్యను టీఆర్‌ఎస్‌ నేతలు అడిగి తెలుసుకుంటున్నారు.