370 ఆర్టికల్ రద్దుకోసం ప్రాణ త్యాగం చేసిన నేత శ్యామ ప్రసాద్ ముఖర్జీ…

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణ రెడ్డి…ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు… రెండు రాజ్యాంగాలు… 2 జాతీయ పతాకాలు ఉండడానికి అనుమతిచ్చే 370 ఆర్టికల్ ఎత్తివేయాలని , జమ్ము కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి పై పోరాట బాట పట్టిబలిదాన మైనగొప్ప నేత,భరతమాత ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరయోధులు, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు స్వర్గీయ డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు . డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 121 వ జయంతిని పురస్కరించుకొని బుధవారం బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సిద్ధాంత రహిత రాజకీయాలు, పదవీ వ్యామోహరాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయ జన సంఘం అనే వాస్తవమైన సైద్ధాంతిక రాజకీయ మార్గాన్ని కనుక్కోవడానికి, స్వతంత్ర భారత రాజకీయాలకు ఓ నూతన దిశా ,లక్ష్యాన్ని ప్రదర్శించిన గొప్ప నేత శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. తన కళ్ళ ముందే నాయకుల ద్రోహం కారణంగా మాతృభూమి ముక్కలు అవుతుంటే చూడలేక చివరి వరకూ పోరాటం చేసిన గొప్ప యోధుడు, దేశభక్తుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ ..నెహ్రూ తప్పుడు విధానాలను ప్రశ్నించిన ఏకైక వ్యక్తి శ్యాం ప్రసాద్ ముఖర్జీ అనిచెప్పారు. తాను నమ్మినఆశయాలు, ధర్మాలకు అనువైన జాతీయ రాజకీయ పక్షం ఉండాలనే ఆకాంక్షతో1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ పార్టీని శ్యామ ప్రసాద్ ముఖర్జీ ప్రారంభించారని తెలిపారు. ఆనాడు కాశ్మీర్ లో భారత్ వ్యతిరేక, జమ్ము వ్యతిరేక విధానాలకు షేక్ అబ్దుల్లా పాల్పడ్డారని, అంతేకాకుండా నెహ్రు తో సన్నిహితంగా వ్యవహరిస్తూ, కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా వ్యవహరించే టట్లు చేసుకొని కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ మన రాజ్యాంగంలో చొప్పించ పడిందే ఆర్టికల్ 370 అని చెప్పారు. నెహ్రూ ఒత్తిడితో రాజ్యాంగంలో కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ 370 వ అధికరణ చేర్చబడిందన్నారు. దీంతో షేక్ అబ్దుల్లాకు ఆర్టికల్ 370 భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఒక లైసెన్స్ గా మారిందన్నారు. భారతీయజన సంఘ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ అంశంలో 370 ఆర్టికల్ కు వ్యతిరేకంగా ఉద్యమించడం ఏ మార్గం అని భావించిఆ దిశగాఅడుగులు వేశారు . పార్లమెంటులో గట్టి పోరాటం చేసిన, నెహ్రూ నిలదీసిన ఆనాటి ప్రభుత్వం మొండి వైఖరితో ఉండడంతో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఉద్యమ బాట పట్టారని చెప్పారు. ఏక్ దేశ్ మేధో ప్రధాన్… ఏక్ దేశ్ మే ధో విధాన్…. ఏక్ దేశమే ధోని షాన్…నహి చెలేగిఅనే నినాదంతో 370 ఆర్టికల్ ఎత్తివేయాలని 1953 మే 8వ తేదీన జమ్ము కాశ్మీర్ యాత్ర ప్రారంభించారని ఆయన తెలిపారు. 370 ఆర్టికల్ రద్దు విషయాన్ని జీర్ణించుకోలేని కొంతమంది దేశ వ్యతిరేకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ ని అరెస్టు చేయించి జైలుకు పంపించారని, జూన్ 23వ తేదీన హఠాన్మరణం చెందారని, కుట్రతో చంపబడ్డరని ఆయన వివరించారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసం అయితే బలిదానం అయ్యారో దానిని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసి వారికి ఘనమైన నివాళులు అర్పిం చిందని ,దేశ చరిత్రలో 370 ఆర్టికల్ రద్దు మైలురాయిగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,కళ్లెం వాసుదేవ రెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, బోయినపల్లి ప్రవీణ్ రావు, బిజెపి జిల్లా ఆఫీస్ సెక్రటరీ మాడుగుల ప్రవీణ్, మీడియా కన్వీనర్ కటకంలోకేష్, జిల్లా అధికార ప్రతినిధి జానపట్ల స్వామి, మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జమాల్, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బల్బీర్ సింగ్, యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బండారి గాయత్రి, దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాల్రెడ్డి, దళిత మూర్చ జిల్లా అధ్యక్షులు సోమిడి వేణు, జిల్లా ఎలక్షన్స్ కన్వీనర్ బండ రమణారెడ్డి, పుప్పాల రఘు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమార్, చిత్తారెడ్డి లక్ష్మణరావు, పురమళ్ళ ప్రసాద్, రాగి సత్యనారాయణ రెడ్డి, మామిడి చైతన్య రమేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

తాజావార్తలు