388పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్‌ కష్టాల్లో ఆస్ట్రేలియా

అడిలైట్‌: అడిలైడ్‌ టెస్టులో భాగంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 550పరుగుల భారీ స్కోరు సాధించింది. తదనంతరం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 388 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది ఫలితంగా అడిలైట్‌ టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసిస్‌ 111పరుగులకే 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 217-2 డేనైట్‌ స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభిం చిన దక్షిణాఫ్రికా 171పరుగులు జోడించింది. గ్రేమ్‌ స్మిత్‌ 122పరుగులు సాధించి ,సిడిల్‌ బంతికి వెనుతిరిగాడు.  రుడోల్ఫ్‌ 29పరుగులు సాధించగా , డివిలియర్స్‌ కేవలం ఒక పరుగువద్ద ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. కాని గాయం తో తొలి టెస్టు ఆడిన ప్లెసిన్‌ 78, కలీస్‌ 58లు నిలకడగా రాణించడంతో దక్షిణాఫ్రికా ఫాలో ఆన్‌ ప్రమాదం నుంచి గట్టెక్కింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హిల్ఫెన్హస్‌ మూడు వికెట్లు,సిడిల్‌,లయన్‌ చెరో రెండేసి వికెట్లు, క్లార్క్‌ వార్నర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.అనంతరం 162పరుగుల ఆధిక్యంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. వార్నార్‌ కోవన్‌ తొలివికెట్‌ కు 77 పరుగులు జోడించారు. ఐతే 41 పరుగుల వద్ద క్లైన్‌ వెల్డ్‌ బంతికి అవుట్‌ కాగా,అదే ఓవర్‌ లో పరుగులేమిచేయకుండా వెనుతిరిగాడు.మరో ఓపెనర్‌ కోవన్‌ 29పరుగుల వద్ద పాంటింగ్‌ (13), సిడిల్‌ (1)లు వెను వెంటనే అవుట్‌ కావడంతో ఆసిస్‌ కష్టాల్లో పడింది. ఇక మూడోరోజు ఆట ముగిసే సమయానికి క్లార్క్‌ 9పరుగులతో, హస్సీ 5పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.