మెల్‌బోర్న్,నవంబర్ 27: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్ట్ కోసం ఆస్టేల్రియా జట్టును ప్రకటించారు. దాదాపు ఏడాది తర్వాత ఫాస్ట్ బౌలర్ మిఛెల్ జాన్సన్‌కు ఆసీస్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. జాన్సన్ చివరిసారిగా గత ఏడాది నవంబర్‌లో ఆడాడు. అయితే తర్వాత గాయంతో పాటు ఫామ్ కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. నాలుగేళ్ల క్రితం సౌతాఫ్రికాతో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జాన్సన్ 11 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఇటీవల ముగిసిన షీఫెల్డ్ షీల్డ్ టోర్నీ ద్వారా అతను మళ్ళీ ఫామ్‌లోకి రావడంతో సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే వైస్ కెప్టెన్ షేన్ వాట్సన్ కూడా మూడో టెస్టులో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 మంది జాబితాలో వాట్సన్‌కు
కూడా చోటు దక్కింది. గాయం కారణంగా మొదటి రెండు టెస్టులకు అతను దూరమయ్యాడు. కాగా మూడో టెస్ట్ కోసం ఆసీస్ సెలక్టర్లు కొత్తగా హ్యాజిల్‌వుడ్‌తో పాటు జాన్ హాస్టింగ్స్‌ను కూడా ఎంపిక చేశారు. రెండు టెస్టుల్లోనూ ఆసీస్ ఆధిపత్యం కనబరిచినా…. సౌతాఫ్రికా పోరాట పటిమతో మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. దీంతో పెర్త్‌లో జరిగే చివరి మ్యాచ్‌లో గెలవాలని కంగారూలు పట్టుదలగా ఉన్నారు. ఈ మ్యాచ్ నవంబర్ 30 నుండి మొదలవుతుంది.
ఆస్టేల్రియా జట్టు ః డేవిడ్ వార్నర్ , ఎడ్ కొవాన్ , షేన్ వాట్సన్ , రికీ పాంటింగ్ , మైకేల్ క్లార్క్ (కెప్టెన్) , మైకేల్ హస్సీ , మాథ్యూ వేడ్ , మిఛెల్ జాన్సన్ , జాన్ హాస్టింగ్స్ , పీటర్ సిడెల్ , బెన్ హిల్ఫెనాస్ , మిఛెల్ స్టార్క్ , నాథన్ ల్యాన్ , జాష్ హ్యాజిల్‌వుడ్
తాజావార్తలు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
- కొనుగోలు చేయక వరిధాన్యం వర్షార్పణం
- పసిడి పరుగులకు బ్రేక్.. భారీగా తగ్గిన ధరలు
- సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య!
- 70 మంది ప్రయాణికులతో వెళ్తూ మంటల్లో చిక్కుకున్న మరో బస్సు
- బస్సు ప్రమాద ఘటనపై డీజీపీతో సీఎం రేవంత్ కాన్ఫరెన్స్
- భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి
- పసిడి ధరలు పతనం
- హెచ్1బీ వీసాలకు స్వల్ప ఊరట
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- మరిన్ని వార్తలు



