4న ఏబీవీపీ కళాశాలల ‘బంద్‌’

4న ఏబీవీపీ కళాశాలల ‘బంద్‌’
బషీర్‌బాగ్‌ : అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం గద్దె దిగాలని డిమండు చేస్తూ ఈనెల 4న ఏబీవీపీ ‘కళాశాలల బంద్‌’ నిర్వహించనుంది. పాఠశాలలను మినహాయించారు. శనివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు, జాతీయ కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.వీరబాబు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు నర్సింహా, యూత్‌ ఎగైనెస్ట్‌ కరప్షన్‌ రాష్ట్ర కన్వీనర్‌ జె.నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.