4లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు: సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఈ ఖరీఫ్‌లో సుమారు 4లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు నీరందిస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రాప్రాంతంలో 69,500ఎకరాలు, రాయలసీమకు 72,305 ఎకరాలు, తెలంగాణ ప్రాంతంలో 2.46లక్షల ఎకరాలకు ఆగస్టు నాటికి సాగునీరు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. గతేడాది పంటవిరామం ప్రకటించిన ప్రాంతాల్లో డెల్టా ఆధునీకరణ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు.