4వ రోజుకు చేరిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె

నిజామాబాద్‌, మే 26(జనంసాక్షి): నగరంలోని మున్సి పల్‌ కార్యాలయం ముందు మున్సిపల్‌ కార్మికులుచేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించి సిపిఐ ప్రధాన కార్యదర్శి దండి వెంకట్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలగించిన కార్మికులను విధులకు తీసుకోవాలని, రిక్షా కార్మికులకు రెండు నెలల వేతనాలు చెల్లించాలని కలెక్టర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రిక్షా కార్మికులకు పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలనిఆయన డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో సావిత్రి, విక్రం, యాదగిరి, యాదమ్మ, దేవరాజ్‌, రాజులను వెంటనే పనులలోకి తీసుకోవాలని ఆయన కోరారు.