42 వడివిజన్లో 10 గం.ల 10 ని.ల కార్యక్రమాన్ని నిర్వహించిన “గుండు చందనపూర్ణచందర్”*

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 07(జనం సాక్షి)
           డెంగ్యూ మరియు మలేరియా జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, డ్రమ్ములలో నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలని 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్అన్నారు.
 ఆదివారం రోజున 42వ డివిజన్ రంగశాయిపేట లోని కుమ్మరివాడలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో 10 గంటల 10 నిమిషముల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
          ఈ సందర్భంగా గుండు చందన పూర్ణచందర్ మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
         ఈ కార్యక్రమంలో డివిజన్ స్పెషల్ ఆఫీసర్ రవిరాజ్, మెప్మా సి ఓ ప్రవీణ్, స్థానిక నాయకులు చందా మనోహర్ మరియు మలేరియా సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area