420 కిలోల గంజాయి పట్టివేత

మారేడుమిల్లి: తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 420 కిలోల గంజాయిని మారేడుమిల్లి పోటీసులు పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘాపెట్టిన పోలీసులు …మారేడుమిల్లి మండలం నుంచి ఐసర్‌ వ్యానులో 14 బస్తాల్లో తరలిస్తున్న 420 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్‌తో పాటు మరో మూడు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు బాధ్యులైన ఏడుగురిని అరెస్టు చేశారు. మారేడుమిల్లి సీఐ ఎం. రవీంద్ర ఆధ్వర్యంలో ఎస్‌.ఐ కోటేశ్వర్‌రావు దర్యాప్తు చేస్తున్నారు.