44టీఎంసీల నీటిని అదనంగా వాడారు
సాగర్ కుడికాలువకు నీటిని నిలిపేయండి
మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్,ఫిబ్రవరి11(జనంసాక్షి): సాగర్ కుడికాలువకు నీటి విడుదల నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్ జలవివాదంపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మంగళవారం సవిూక్ష జరిపారు. ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీలు, సీఈలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కుడికాలువకు నీటి విడుదల ఆపేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే ఏపీ 44 టీఎంసీలను అదనంగా వాడుకుందని, దాంతో సాగర్ నీటిమట్టం తగ్గిందని హరీశ్‌రావు ఆరోపించారు. సాగర్ కుడి కాలువ, కృష్ణా డెల్టాకు నీరు వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నాగార్జున సాగర్ పరిస్థితిపై ఆయన సవిూక్షలు జరిపారు. కేటాయించిన వాటాకంటే ఏపీ 44 టీఎంసీలు అధికంగా వాడుకోవడం వల్లే సాగర్ నీటి మట్టం తగ్గిందని ఆరోపించారు. ప్రస్తుతానికి 51 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ఏపీకి నీరు అదనంగా కావాలంటే ఇప్పటి వరకు వాడుకున్నది..కావాల్సింది రాతపూర్వకంగా ఇస్తే సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఇరిగేషన్ శాఖ ఎన్‌సీలు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. నాగార్జునసాగర్ జవహార్ కాలువకు నీటి విడుదల నిలిపివేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే 44 టీఎంసీలను ఆంధప్రదేశ్ అదనంగా వాడుకుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఏపీ అదనంగా నీరు వాడటంవల్లే సాగర్ నీటిమట్టం తగ్గిందన్నారు. ఇప్పటికే సాగర్‌లో నీటి మట్టం తగ్గడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోకపోవడం, బోర్డు కూడా నిస్సహాయంగా ఉండడంతో మళ్లీ రెండు రాష్టాల్ర మధ్య తగాదా మొదలైంది.ఎపి ఇప్పటికే నలభై నాలుగు టి.ఎమ్.సి.ల నీటిని అదనంగా వాడుకుందని తెలంగాణ నీటిపారుదల శాఖ ఆరోపించింది. నీటి వినియోగం లెక్కలపై స్పష్టత వచ్చే వరకు సాగర్ కుడి కాల్వకు నీటి విడుదల నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం బావిస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి. రెండు రాష్టాల్రు దీనిపై ఒక అవగాహనకు రాకుండా,పోటాపోటీగా నీటిని వాడే పరిస్థితి ఏర్పడడం,కొన్నిసార్లు నీటిని వృదా చేస్తున్నారన్న విమర్శలు రావడం వంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది మళ్లీ పెద్ద వివాదం అవుతుందా అన్నది చూడాలి. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పర్యటన చేయడానికి ఒక రోజు ముందుగా ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావనకు తీసుకు వస్తుండడం గమనించవలసిన అంశమే.