5వ రోజు కొనసాగుతున్న నిరసన కార్యక్రమం సంఘీభావం తెలిపిన ఎంపీపీ అంజయ్య

 

దంతాలపల్లి సెప్టెంబర్ 5 జనంసాక్షి

భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య(లియాఫీ), ఆల్ ఇండియా జాక్ ఇచ్చిన పిలుపుమేరకు సెప్టెంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా నిరవధికంగా చేస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు ఏజెంట్ల రెస్ట్ (విశ్రాంత) డే కొనసాగుతుందని లియాఫీ మహబూబాబాద్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి పాశం రమేష్ తెలిపారు. 5వ రోజు ధర్నా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఎల్ఐసి శాటిలైట్ కార్యాలయం ముందు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దేశానికి రైతు వెన్నుముక ఎలాగో, భారతీయ జీవిత బీమా సంస్థకు ఏజెంట్ వెన్నెముక అని అలాంటి ఏజెంట్ వ్యవస్థ నీరుగార్చే విధంగా వ్యవరిస్తున్నదని విమర్శించారు. పాలసీలపై బోనస్ రేట్ పెంచాలని, పాలసీ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించాలని,పాలసీలపై జిఎస్టి నీ రద్దు చేయాలని, బాండ్ల పంపిణీ పోస్టు ద్వారా పంపే విధానం ఆపాలన్నారు,ఐదేళ్ల పైబడిన పాలసీలను పునరుద్ధరించాలని, ఆఫీసులో కస్టమర్లకు సమర్థవంతమైన సర్వీసును అందించాలని అన్నారు,
ఏజెంట్లను ప్రొఫెషనల్ ఏజెంట్గా గుర్తించాలని, గ్రాడ్యుటి పెంచాలని, ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలన్నారు.ప్రతి ఏజెంట్ కు గ్రూప్ మెడిక్లైమ్ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చదాక ధర్నా కొనసాగిస్తామన్నారు. తొర్రుర్ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య నిరసన శిబిరాన్ని సందర్శించి ఏజెంట్లు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాణాల బిక్షపతి,ప్రచార కార్యదర్శి పులి సోమన్న , ,కార్యవర్గ సభ్యులు మండల ప్రభాకర్, కల్లెడ వెంకటేశ్వర్లు,కిన్నెర పాండు, నాగేశ్వరరావు ,నాగన్న రాంబాబు, హరికృష్ణ,. యాకయ్య, ఏకాంతం, ఉప్పలయ్య, జితేందర్ శ్రీనివాసులు మల్లికార్జున్, దాసరి యకన్న రాజేందర్ తదితరులు పాల్గొన్నారు .