50వేలకు మించి నగదు రవాణా తగదు: కలెక్టర్‌

వరంగల్‌,మార్చి13(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నియమావళి అమలులో ఉన్నందు వల్ల ప్రజలు యాభైవేల రూపాయల కంటే అధికంగా నగదును తీసుకువెళ్లవద్దని వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌ జే పాటిల్‌ ఆదేశించారు. ఆన్‌లైన్‌ లావాదేవీలపై కూడా తాము నిఘా వేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బహిరంగస్థలాలు, గోడలపై రాతలు రాయవద్దని కోరారు. అభ్యర్థులు ఎవరైనా గోడలపై రాతలు రాసినా, ¬ర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేసినా వెంటనే తొలగించాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులను ప్రశాంత్‌ ఆదేశించారు. బెల్‌ ఈవీఎంల స్థానంలో ఈసీఐఎల్‌ తయారు చేసిన ఈవీయంలను ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తామని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా 50వేలరూపాయల కంటే అధికంగా నగదు తీసుకువెళ్లేందుకు వీలు లేదని, అలా చేస్తే నగదును సీజ్‌ చేస్తామని ఎన్నికల అధికారి హెచ్చరించారు.