6వ జోనల్ లెవెల్ గేమ్స్ ప్రారంభం.

ప్రారంభించిన ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి.

ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్.

జనం సాక్షి ఉట్నూర్.

అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని లాల్ టెక్డీ టీటీడబ్ల్యుఆర్జెసి కళాశాలలో నిర్వహిస్తున్న ఆటల పోటీలను ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శాం నాయక్ ఉట్నూర్ ఐటిడిఏ పిఓ వరుణ్ రెడ్డి తో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయక్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు క్రీడల పరంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం తరఫున మంచి ప్రాధాన్యత ఇస్తుందని విద్యార్థి దశలో నేర్చుకున్న క్రీడలు జీవితంలో ఎన్నో ఉన్నత స్థానాలకు తీసుకోని వెళుతుందని అన్నారు. ఎమ్మెల్యే విద్యార్థి దశలో ఆడిన క్రీడలను ఆ సన్నివేశాలను విద్యార్థులతో పంచుకున్నారు.

ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ

విద్యార్థులకు చదువుతోపాటు ఫిట్నెస్ పై దృష్టి సారించాలని విద్యార్థి దశలో ఆటలాడుతూ ఉన్నత స్థాయికి ఎదిగి దేశం కోసం ఒలంపిక్స్ లో ఆడడానికి కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ చైర్మన్ కనక లక్కే రావు ఎంపీపీ పంద్ర జైవంత్ రావు పిఈడి శ్రీనివాస్ టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు ఉన్నారు.