60వేల నగదు-10తులాల బంగారం అపహరించిన దొంగలు

నిజామాబాద్‌: సిరికొండ మండలంలోని వొన్నాజీపేటలో మంగళవారం మిద్దెల బీరయ్య, మిద్దెల సత్యనారాయణ నివాసాల్లో దొంగలు పడి 60వేల నగదు, 10తులాల బంగారం ఎత్తుకెళ్లారు. వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు ఈ దొంగతనం జరిగింది. అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.