61 వాహనాలకు జరిమానా

కరీంనగర్‌ నేరవిభాగం, (జనంసాక్షి):నల్లరంగు అద్దాలు వినియోగిస్తున్న వాహనదారులకు నగర ట్రాఫిక్‌ పోలీసులు భారీగా జరిమానా విధిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 13 నుంచి జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం నాటికి 119 కార్లపై కేసులు నమోదు చేసి రూ.43,600 జరిమానా విధించారు. మంగళవారం ఉదయం నుంచి పోలీసులు తనిఖీలు చేపట్టి నల్లరంగు ఉన్న కార్లను ట్రాఫిక్‌ ఠాణాకు తరలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు మొత్తం 61 కేసులు నమోదు చేసి రూ.19,300 జరిమానా వసూలు చేసినట్లు ట్రాఫిక్‌ సీఐ రంగయ్యగౌడ్‌ తెలిపారు. అద్దాలకు నల్లరంగు ఫిల్మ్‌లు వెంటనే తొలగించుకోవాలని సీఐ పేర్కొన్నారు.