పట్టాలుతప్పడంతో ఘోర రైలు ప్రమాదం

స్పెయిన్‌: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శాంటియాగో  డీ కంపోస్టిలాలోని నార్త్‌ స్పానిష్‌ సిటీలో రైలు పట్టాలుతప్పడంతో దాదాపు 60 మందికి పైగా మృతిచెందగా 70 మంది వరకు గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైల్లో 218మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 13 బోగీలు పట్టాలుతప్పడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. గత నాలుగు దశాబ్ధాల్లో అత్యంత ఘోర రైలు ప్రమాదం ఇదేనని స్పెయిన్‌ వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘటనపై ప్రధాని మరియానో రాజాయ్‌ ఉన్నతాధికారులతో అత్యసర సమావేశం నిర్వహించారు. క్షతగాత్రులకు మెరుగైన వ్యైదం అందించడంతోపాటు సహాయచర్యలు వేగవతం చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఘటనాస్థలాన్ని ప్రధాని సందర్శించనున్నారు.