కార్మికవర్గ పార్టీ, ఆర్థికవాదం, రివిజనిజం
మరోవైపు ప్రధానంగా విద్యార్థులు ఉన్న యూనియన్ ఆఫ్ రష్యన్ సోషల్ డెమొక్రాట్స్ నుండి ఆర్థికవాదం (ఎకనమిజం) అని పిలువబడే దాడి ఏర్పడింది. తక్తరేవ్ అనే వైద్య విదార్థి దీనికి నాయకత్వం వహించాడు. ప్రవాసంలో ఉన్న ప్లెఖనోవ్ సంస్థ పంపే పత్రిక పంపిణీ, నిధుల సేకరణ, ప్రింటింగ్ నిర్వహణ వంటి రహస్య కార్యక్రమాలు ఈ యూనియన్ నిర్వహిస్తుంది. లీగల్ మార్క్సిస్టులు వర్గ పోరాటాన్ని , గతి తర్కాన్ని తిరస్కరిస్తే, ఆర్థికవాదులు కార్యవాద దృక్పథం(ప్రాక్టికల్ ఔట్‌లుక్) పేరుతో కార్మికులకు సిద్ధాంతంతో పనిలేదని వాధించారు. లెనిన్, మార్తోవ్ రహస్య తరగతుల్లో శిక్షణ పొందిన సీనియర్ కార్మికులు మొత్తం అరెస్టు అవ్వడంతో , కొత్త శ్రేణుల్లో వీరి ప్రభావం పడింది. ప్లెఖనోవ్ వ్యక్తి గత స్పర్థగా మొదలై, నిధులకు సంబంధించిన తెక్కల వివాదంలో మెదిరిన ఆర్థికవాదం చివరికి ఒక స్పష్టమైన వైఖరిగా రాబోచ్య మ్యసల్ అనే పత్రికలో బయట పడింది. కార్మికులకు ఆర్థిక పోరాటమే ప్రధానం. రాజకీయ లక్ష్యం మాటున ఉద్యమం ఆర్థిక పునాది మరుగుపడింది. ఆర్థికహోదా, పెట్టుబడులతో రోజూవారి ప్రయోజనాలకై పోరా టం, వాటి కోసం సమ్మెలు మాత్రమే కార్మిక వర్గ లక్షాలు-అని వారు వాదించారు.దీని సారాంశం-కార్మికులకు రాజకీయాలతో పనిలేదు. అంటే విప్లవ పార్టీ అవసరం లేదు. పార్టీని రాజకీయ చైతన్యం లేని వెనుకబడిన కార్మిక శ్రేణులలో కలిసి వేయాలి. లెనిన్, మార్తోవ్‌లు పెరెల్ మీద విడుదలైనప్పుడు వారిని కలిసిన తక్తరేవ్ ,కార్మిక సంఘంలో సభ్యులందరికి పార్టీ సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదించాడు. దీనికి బదులుగా లెనిన్ కార్మికులను పార్టీ సభ్యలుగా తీసుకోవాలని, కానీ పార్టీకి (కార్మికవర్గ అగ్రగామి శ్రేణి), కార్మిక సంఘానికి (విశాలవర్గసంఘం) నడుమ విభజన ఉండాలని, రహస్య జీవితం గడుపుతున్న పార్టీకి ఇది మరీ ముఖ్యం అని వాదించాడు.కొంత సద్దుమనిగిన వివాదం, జర్మనీలోని జెర్మ్‌స్టీన్ ప్రభావం తోడై, ఇ.డి. కుస్కోవా రాసిన ది క్రెడో అనే రహస్య డాక్యుమెంట్ బయటికి పొక్కడంతో, తిరిగి రాజుకుంది. సైబీరియాలో శిక్ష అనుభవిస్తున్న లెనిన్, తదితరులకు అందించిన ఈ డాక్యుమెంట్ ఇలా ప్రకటించింది.:… స్వతంత్ర పార్టీ వాదన అనేది మన సమాజంలోకి విదేశీ భావాలు జొప్పించడమే. రష్యన్ మార్క్సిస్టుల ముందు ఉన్నది.ఒక్కటే దారి, కార్మికుల ఆర్థికుల పోరాటాల్లో భాగస్వామ్యం, ఉదారవాద ప్రతిపక్ష కార్యక్రమాల్లో పాల్గొనడం’. (లెనిన్ రచన, ఏ ప్రొటెస్టుబై రష్యన్ సోషల్ డెమొక్రాట్స్, మార్క్సిస్ట్సు డాట్ ఆర్గ్, లెనిన్ ఆర్కైవ్ నుండి)ప్రపంచ వ్యాప్తంగా -సామ్యవాద సమాజాల్లో కొంత బలంగా, ఇండియా వంటి దేశాల్లో బలహీనంగా ఉండే-ఉదాహరణకి ఉన్న ఒక ఒక లక్షణం ఇక్కడ కనిపిస్తుంది. రాజ్య వ్యవస్థ, యంత్రాంగం గురించి మౌనం వహించడం,లేదా రాజ్యానికి వర్గ లక్షణం లేదని భ్రమ కలిగించడం. కార్మిక పోరాటాలు కేవలం కార్మికుల, పెట్టుబడ ిదారుల ప్రైవేటు వ్యవహారం అన్నట్లు చిత్రించడం దీని లక్షణం. ఆర్థిక వాదుల భ్రమలు జార్ ఐక్య రాజ్యాంగం మీద పనిచేసిన దాఖాలాలు మాత్రం లేవు. వరుసగా సమ్మెల మీద పోలీసులు, సైన్యం దాడులు చేసి నాయకత్వ శ్రేణులను అరెస్టుల రూపంలో తొలగించే ప్రయత్నం మాత్రం అది మానుకోలేదు. కార్మికులు కేవలం ఆర్థిక డిమాండ్ల కోసం పోరాడాలన్న ఆర్థిక వాదులు రాజకీయ ఉద్యమాన్ని ఉదారవాదులకు వదిలేసి వారికి తోకలుగా మారారు. కుస్కోవో స్వయంగా రష్యన్ పెట్టుబడిదారుల ప్రధాన పార్టీ అయిన కాడెట్టతో కలిసి పోయింది. విప్లవ మార్క్సిజం శ్రామికులలోని అత్యంత చైతన్యవంతమైన, మిలిటెంట్ నాయకత్వ శ్రేణికి ప్రాతినిధ్యం వహిస్తే , ఆర్థికవాదం దీనికి పూర్తిగా విరుద్ధమైన పాత్రకు ప్రాతినిధ్యం వహిస్తుంది.ఇలా వెనుకబడిన రష్యాలో అవకాశవాదంతో పోరాటం నడుస్తుండగా, యూరప్‌లో, ప్రధానం గా జర్మనీలో, మార్క్సిస్టు మౌలిక సూత్రాలను తిరిగి రచించాలనే (రివిజన్) వాదనమొదలైంది. కమ్యూనిస్ట్ మానిఫెస్టో 50 వ వార్షికోత్సవ సందర్భంగా , ప్రముఖ మార్క్సిస్టు సిద్ధాంత కర్త కార్ల్ కాట్‌స్కీ సంపాదకత్వంలో నడుస్తున్న డై న్యూ జెఇట్ పత్రికలో వచ్చిన వాసం దీనికి నాంది పలికింది. జర్మన్ సోషల్ డెమెక్రాట్ పార్టీ నాయకుడు ఎడ్వర్డ్ జెర్న్‌స్టీన్ ఈ వ్యాసంతో మార్క్సిజాన్ని తిరిగి రాసే (రివిజనిజం) తన కార్యమ్రంమొదలుపెట్టాడు. పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రీకరణ మార్క్స్ భావించిన దానికంటే నినాదంగా జరుగుతున్నది. పెట్టుబడిదారీ విదానాన్ని నియంత్రించి సంక్షోభాల తీవ్రత తగ్గించవచ్చు. (తర్వాత కాలంలో కీన్స్ విధానాలు ). కార్మికవర్గం కేవలం తన రక్షణ అవసరాల కోసమే ఉద్యమిస్తుంది. (బెర్న్‌స్టీన్ రచనలు మార్క్సిస్టు డాట్‌ఆర్గ్ వెబ్‌సైట్‌లో చదవవచ్చు.) ఇదంతా గత వంద సంవత్సరాలుగా అవకాశవాదాన్ని, సంస్కరణా వాదాన్ని సమర్థించు కోడానికి, ‘భావ స్వతంత్య్రం’, ‘సృజనీత్మకత మార్క్సిజం లాంటి పేర్లతో వామపక్ష ఉద్యమాల్లోకి ప్రవేశిస్తూనే ఉన్నాయి. ఇక్కడ సమస్య భావ ప్రకటన,సృజనాత్మకత కాదు. మార్క్సిజాన్ని, మత గురువుల ప్రవచనాలలాగా స్వీకరించాలనో, విమర్శకు, విశ్లేషణకు అతీతంగా భావించాలనో కాదు. వాస్తవానికి కార్మికవర్గదృక్పథం అంటే దేనినైనా శాస్త్రీయంగా, అంటే బహుమంఖంగా, చలనంలోభాగంగా పరిశీలించి, ఆచరణ అనే పరీక్షకు గురి చేసి స్వీకరించడమే. ఫ్యూడల్ సమాజాన్ని అంతంచేసి తన అధికారాన్ని స్థాపించడమే పరిమిత లక్షానికి అవసరమైన తాత్విక,నైతిక, సమాజిక, కళాత్మక ప్రతిపాదిక కోసం జూర్జావా వర్గం జరిపిన పోరాటం యూరప్‌లో రినైసన్స్ రూపం తీసుకుంటే, వర్గ సమాజాన్ని అంతం చేయడానికి అవసరమైన కృషి మానవ విజ్ఞానాన్ని వీలైనంత అభివృద్ధి చేస్తే గాని సాధ్యంకాదు.అలాగని రివినిజం శూన్యంలో నుండి ఊడిపోలేదు. దీనికి ఖచ్చితంగా వస్తుగత పునాది ఉంది మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు (పెట్టుబడిదారీ విధానంలో సామ్రాజ్యవాద యుద్ధాలు జరిగినవని కూడా బెర్న్‌స్టీన్ రాశారు) జర్మనీ, బెల్జియం, ప్రాన్స్, బ్రిటన్ వంటి సామ్రాజ్యవాద దేశాల్లో కార్మికవర్గంలో ఒక దొంతరకు కొంత ఆదాయాలు పెరి గాయి. ఈ పునాది మీద ఆధారపడి సోషల్ డెమొక్రటిక్ పార్టీలో, కార్మిక సంఘా ల్లో, ముసిపల్, పార్లమెంట్ సభ్యుల్లో పదవులు సంపాదించుకున్న ఉద్యోగ పార్లమెంట్ దొంతర ఏర్పడింది. వీరకి సామ్యవాదం, సిద్ధాంతం అనేవి కొంత మేధో కాలక్షేపంలా తప్ప తక్షణ పోరాజ కర్తవ్యా లుగా కనబడుట లేదు. ఆర్థిక డిమాం డ్ల కొరకు,సంస్కరణ కొరకు ఆందోళన చేసి, విప్లవ మనేది ఎప్పుగో సుదూర భవిష్యత్‌లో ఉన్న విషయంగా, లేక సంస్కరణల ద్వారా సామ్యవాదం సాధించొ చ్చు అని చిత్రించి వీరు తాము అనుభవిస్తున్న సౌకర్యాలు, హోదాలకు ప్రమాదం లేకుండా చూసుకు న్నారు. వీరు కొంత విపరీతంగా, బహు ముఖంగా పరిశీలిస్తే రష్యా, పోలాండ్ లేదా ఐర్లాండ్,ఆసియా వలస దేశాల్లో పెట్టుబడి ప్రవేశాన్ని, అక్కడ నగ్నంగా జరుగు తున్న దోపిడీని, పెట్టుబడిదారీ విధానంలో మార్కెట్లు, వరుసల కోసం జరిగే పీకలు చేసే పోటీని , దాని వల్ల రాజీ (శాంతి) అనేది కేవలం తిరిగి పోటీకి (దేశాల స్థాయిలో యుద్ధం)విరామం మాత్రమేనని గుర్తించే వారు., కానీ ఆ శాస్త్రీయ దృష్టివారి-పెద్ద పెట్టుబడిదార్లకు కార్మికులకు నడుమ ఏర్పడిన దళారీ దొంతర-ప్రయోజనాలకు సరిపోదు. సంస్కరణ లకోసం పోరాడే విప్లవ కారులకి, సంస్కరణవాదులకి ఉన్న తేడా ;సంస్కరణలు చేసుకుంటూ పోతే మౌలిక మార్పులకి దారి తీస్తుందన్న అపోహకల్పించడమే. సంస్కరణవాదం. సంస్కరణలు మౌళికమార్పుకోసం చేసే పోరాటంలో కొద్దిపాటి విజయాలుగా పరిగణించడం విప్తవ సిద్ధాంతం. బెర్న్‌స్టీన్ తొలిరచన వెలువడగానే ప్లెఖనోవ్, కాట్‌స్కీని ఆ వ్యాసాన్ని ఖండించమని కోరాడు. కొంతకాలం తాత్సారం చేసిన కాట్‌స్కీ, కర్ర విరగకుండా పాము చావకుండా ఓ ప్రకటన చేశాడు.’… అందరినీ పునరాలోచిం పజేసిన బెర్న్‌స్టీన్‌కు మనం ధన్యవాదాలు తెలుపాలి.’ అని ముగించా డు. దీనిపై స్పందించిన ప్లెఖనోవ్ ‘మనం ఎందుకు ధన్యవాదాలు తెలుపాలి?’అనే బహిరంగ లేఖ రాసి ‘బెర్న్‌స్టీన్ సోషల్ డెమొక్రసీని పాతిపెడతాడా. లేక సోషల్ డెమొక్రసీ బెర్న్‌స్టీను పాలిపెడుతుందా? అని ప్రశ్నించాడు. యూరప్‌లో మార్క్సిజాన్ని ప్రముఖ సిద్ధాంత కర్తగా గుర్తింపు ఉండి, ఇలా మెతక వైఖరి వహించిన కాట్‌స్కీ కూడా అదే రివిజనిస్టు బాటపట్టాడు. (చూ.లెనిన్ రచన ది ప్రొలిటే రియన్ రెవల్యూషన్ అండ్ ద రెనగేడ్ కాట్స్‌స్కీ,ప్రొగెస్ పబ్లీషర్స్, మాస్కో లేదా మార్క్సిస్టు ఇంటర్నెట్‌ఆర్కైవ్)అప్పటి వరకు స్పష్టమైన సిద్ధాంతంలేని ఆర్థికవాదులకు, ప్రవాసంలో ఉన్నవారి ప్రతినిధులకు బెర్న్‌స్టీన్ రచనలో పెద్దమద్దతు అభించింది. జర్మనీ వంటి దేశాల పరిస్థితి లేని రష్యాలో సంస్కరణవాదులు ఇలా జర్మన్, బ్రిటీష్ సంస్కరణ వాదుల నుండి స్వీకరించిన సిద్ధాంతాలు రష్యాలో బలహీనమైన సెక్షన్ల-విద్యార్థులు, బూర్జావా మేధావులు-రూపంలో కార్మికవర్గంలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావం ఒక ఐక్యపార్టీ , సిద్ధాంత పటిమ గల రాజకీయ పత్రిక అవపరాన్ని తెలియజేశాయి. లెనిన్ ఇస్క్రా పత్రిక స్థాపన తోనే ఐక్యపార్టీ అయిన రష్యన్ సోషల్ డెమొక్రటిక్ లేబర్ పార్టీ (ఆర్‌ఎస్‌డిఎల్‌సి) సాధ్యమైంది.మార్చ్ 1898లో మిన్స్క్ పట్టణంలో రుమ్యన్‌త్సేవ్ లనే రైల్వే కార్మికుని ఇంట్లో మొదటి పార్టీ మహాసభ జరిగింది.మాస్కో, కీవ్,పీటర్‌బర్గ్, ఎత్కరినస్లోవ్, కార్మిక పత్రిక (రాబోచాయగెజెటా), యూదూ సోషల్ డెమొక్రటిక్ బండ్ నుండి వచ్చిన తిమ్మిది మంది ప్రతినిధులు, ఇంట్లో పండుగ పేరుతో రహస్య సమావేశం జరిపి పార్టీని స్థాపిం చారు. జైలు నుండి పార్టీ ముసాయిదా కార్యక్రమాన్ని లెనిన్ రహస్యంగా పంపాడు. కానీ మహాసభ జరిగిన నెలలోపే ప్రతిని ధులలో ఐదుగురు అరెస్టు కావడంతో ఆ ప్రయత్నం మూల పడింది. జార్‌పాలనలో రష్యాలో జరిపిన మొదటి,చివరి మహాసభ అదే. రష్యాలో పార్టీ స్థాపన సాధ్యంఅని మాత్రం అది నిరూపిం చింది. నిర్భదం వల్ల జార్ ప్రభుత్వం ఉన్నంత కాలం పార్టీ మహాసభలు రష్యా బయట జరపవలసి వచ్చింది. రష్యన్ కమ్యూ నిస్ట్ పార్టీ చరిత్ర ఒక చిన్న వాసంలో రాయడం సాధ్యంకాదు. లెనిన్ సాధించిన అతిపెద్ద విజయం రష్యాలో విస్లవాన్ని సాధించగల పార్టీని నిర్మించి సారథ్యం వహించడం.వివరంగా తెలుసుకోదల్చిన వారు జినోవీవ్, ట్రాట్‌స్కీ, ఇ.ఎచ్.కార్,అలన్‌వుడ్స్ రచనలు చదవగలిగారు. వీటిలో కొన్ని ఇంటర్నెట్‌లో దొరుకుతాయి.
-ఎస్ నరేంద్రమోహన్