ఓటరు మహాశయా! జాగ్రత్త!

అదిగదిగో వస్తున్నాడు

దవళ వస్త్రంధరించి

చిరునవ్వును సారించి

తేనెమాటలు సంధించి

చిలుకపలుకులతో మురిపించి

నీ చేతిలోని ఆయుధాన్ని ఆశించి

మాటల గారడితో నిను ముంచి

మందు విందుల ఎరచూపి

ధన ప్రవాహపు రుచి చూపి

వాగ్దానాలతో నిను వంచించి

ఆశచూపి నీ ఓటు తస్కరించి

నక్క వినయాలు ఒలకబోసి

నిలువునా నిను దగా చేసి

అధికారం చేజిక్కించుకొని

ఐదేళ్లు తన రీతిన పాలిస్తాడు

నేడు నీ చుట్టూ తిరిగినవాడు

తన చుట్టు తిప్పించుకుంంటాడు

తస్మాత్‌ జాగ్రత్త మహాశయా

లేదంటే అవుతావు నిరాశ్రయ

-వైరాగ్యం ప్రభాకర్‌