ఆదర్శ రైతుపై ప్రత్యర్థుల దాడి

వరంగల్‌: జిల్లాలోని మర్రిపెడ మండలం అనేపురం గ్రామంలో ఆదర్శ రైతుపై ప్రత్యర్థులు దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రైతును కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా సర్పంచి అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నందుకే ప్రత్యర్థి వర్గీయులు దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.