స్వతంత్ర గ్రూపుపై ఐటీ దాడులు
రాజమండ్రి,(జనంసాక్షి): తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని స్వతంత్ర గ్రూపుపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ, స్వతంత్ర ఆస్పత్రులపై ఏక కాలంలో అధికారులు దాడులు చేశారు. అక్కడి రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు గన్ని భాస్కరరావు నేతృత్వంలో ఈ ఆస్పత్రులు నడుస్తున్నాయి.