రాజీనామాలపై స్వరం మార్చిన సీమాంధ్ర మంత్రులు

హైదరాబాద్‌: సీమాంధ్ర మంత్రులు విభజనపై తమ స్వరం మార్చారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తామన్న వార్తలపై మంత్రులు టీజీ వెంకటేష్‌, ఏరాసు ప్రతాపరెడ్డి ఖండించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది తమ ప్రధాన డిమాండన్నారు. తమ ప్రాంత మనోభావాల మేరకు సాయంత్రం ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంపై ఈ మేరకు ఒత్తిడి తెస్తామని వివరించారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నాదానికి కట్టుబడే ఉంటామని మంత్రులు స్పష్టం చేశారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడనివారు రాజీనామాలు చేస్తారని అది విభజన తరువాత అని తేల్చి చెప్పారు.