తెలంగాణ ఇస్తే నక్సల్స్ సమస్య ఉండదు
ఇదంతా ఊహాగానమే : డీజీపీ
హైదరాబాద్, జూలై 25 (జనంసాక్షి) :
తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో నక్సలైట్ల సమస్య ఉత్పన్నం కాదని డీజీపీ దినేశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కేంద్రానికి ఇచ్చిన నివేదిక పూర్తిగా అబద్దమని తేలిపోయింది. రాష్ట్రంలో అసలు నక్సల్స్ లేనే లేరని న్యూఢిల్లీలో ఉన్న డిజిపి దినేష్‌రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లుగా ప్రకటించారు. గత నాలుగు రోజులుగా ఢిల్లీలోఉన్న ఆయన కాంగ్రెస్ పెద్దలు, ¬ంమంత్రి తదితరులను కలుసుకుంటున్నారు.ఇప్పటికే అందరివాదనలు తెలుసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం డిజిపిని పిలిపించింది. ఇందులోబాగంగా గురువారం ఢిల్లీలో ఆయన విూడియాతో మాట్లాడుతూ తెలంగాణా వస్తే నక్సలైట్లు పెరుగుతారనుకోవడం అంతా ఊహాగానాలేనన్నారు. ఊహాగానాలతో ఏసమస్యను కొలువలేమన్నారు. ఇప్పటికైతే నక్సలైట్లను పూర్తిగా అణిచివేశామన్నారు. రాష్ట్రంలో నక్సలిజం అనేదే లేదన్నారు. అయితే నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం తెలంగాణా ఇస్తే నక్సలిజం పెరుగుతుందని చెప్పడం పూర్తిగా అబద్దమని తేలిపోయిందని తెలంగాణా వాదులు పేర్కొంటున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ధ్వంద్వ నీతికి నిదర్శనంగా నిలువుటద్దంగా మారిందన్నారు. ముమ్మాటికి సీమాంధ్ర వాదేనని తేలిపోయిందంటున్నారు. ముఖ్యమంత్రి ¬దాలో ఉండి సీమాంధ్రకు ప్రతినిధిగా వ్యవహరించిన తీరుతో ఆయన నైజం, విష సంస్కృతి తేటతెల్లం అయిందంటున్నారు.